వైయస్సార్ వర్ధంతి రోజే… మహానేతకు ఘోర అవమానం..!
వైఎస్సార్ స్మృతిని విస్మరించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి పోచారం కాంగ్రెస్ అధ్యక్షుడి తీరుపై వైఎస్సార్ అభిమానుల మండిపాటు ఘట్కేసర్: (ప్రభంజనం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అగమ్యగోచర స్థితిలో ఉన్న వేళ, వరుసగా రెండుసార్లు పార్టీకి సంపూర్ణ ప్రజాదరణ తెచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డిది. పేదల గుండెల్లో నిలిచిన ఆ మహానేత వర్ధంతి రోజే, ఆయన ఫొటో కూడా లేకుండా కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. మేడ్చల్ జిల్లా...