PRABANJANAM
Date of Publish : 24 October 2026, 7:40 am Posted by : Prabanjanam News

ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవం..

  • తన్మయత్వంతో తిలకించిన భక్తులు

యాదగిరిగుట్ట: ( ప్రభంజనం )

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి ఊంజల్‌ సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహిళా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని అద్దాల మండపంలో అమ్మవారిని ఊయలపై అధిష్ఠింపజేసి ఊంజల్‌ సేవోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.