Kukatpally: ఓయో హోటళ్లలో వ్యభిచార దందా.. 11 మంది అరెస్టు.. ముగ్గురు మహిళలకు విముక్తి
రెండు హోటళ్లపై పోలీసుల మెరుపుదాడులు.. కూకట్ పల్లి {ప్రభంజనం}: కూకట్‌పల్లి పరిధిలోని ఓయో హోటళ్ల వేదికగా సాగుతున్న వ్యభిచార గుట్టును పోలీసులు రట్టు చేశారు. భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లో ఉన్న రెండు హోటళ్లపై కేపీహెచ్‌బీ,కూకట్‌పల్లి పోలీసులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మహిళ సహా ఆరుగురు నిర్వాహకులను, ఐదుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యబిచారం కూపంలో మగ్గుతున్న ముగ్గురు బాధితురాళ్లను సురక్షితంగా రక్షించారు. నిందితులపై పోలీసులు పిటా, బీఎన్‌ఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు....