మద్యానికి ‘నో’.. పెద్ద ఎక్లరా గ్రామసభ సంచలన తీర్మానం
మద్యపాన నిషేధానికి పెద్ద ఎక్లరా గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం గ్రామస్తులంతా ఏకమై నిర్ణయం.. అధికారులకు తీర్మానం పత్రం అందజేత జుక్కల్ (ప్రభంజనం): మద్యపాన నిషేధానికి పెద్ద ఎక్లరా గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందడుగు వేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ నిర్ణయంతో పెద్ద ఎక్లరా గ్రామం మద్నూర్ మండలంలో ఆదర్శంగా నిలిచింది. గ్రామసభలో పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో మద్యం విక్రయాలు, సరఫరాను...