దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఊర్లకు వెళితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలి కీసర ఇన్స్ పెక్టర్ బిక్కి రమేష్ కీసర, ( ప్రభంజనం ): దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ప్రజలు స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లే సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ బిక్కి రమేష్ సూచించారు. పండుగ సెలవుల్లో ఇళ్ల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో కోరారు. ప్రయాణానికి వెళ్లే ముందు ఇంటి తలుపులకు బలమైన తాళాలు వేయాలని, కిటికీలు సక్రమంగా మూసివేయాలని...