Ponnam Prabhakar: మంత్రి పొన్నం నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక నివాసంలో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల కోలాహలం మధ్య ఈ వేడుకలు అత్యంత ఘనంగా, ఆత్మీయంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఇదే వేడుకలో మంత్రి సోదరులు పొన్నం అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారి సోదరీమణులు రాఖీలు కట్టారు. రాఖీలు కట్టించుకున్న అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో...