ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత..

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో విషాదం ముంబై: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు కన్నుమూశారు. బ్లడ్ క్లాట్ అవడంతో గుండెపోటు రావడమే ఆయన మృతికి కారణమని కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు.  సౌత్‌లో 70కి పైగా చిత్రాల్లో.. దక్షిణాదిలో విలన్‌గా, కేరక్టర్...