ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా
రాజేంద్రనగర్: సహచర మహిళా అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రిమాండ్‌లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ముత్యాల ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.గురువారం ఉప్పరపల్లిలోని రాజేంద్రనగర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు పోలీసుల దర్యాప్తు తీరుపై...