PRABANJANAM
Date of Publish : 04 August 2026, 9:43 pm Posted by : Prabanjanam News

తెలంగాణలో మండల స్థాయిలోనూ ‘ప్రజావాణి’!

  • ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయాల్లో అర్జీల స్వీకరణ
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలకే పరిమితమైన ‘ప్రజావాణి’ని ఇకపై మండల స్థాయికి విస్తరించింది. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్థాయి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లే ఇబ్బందులను తప్పించేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడనుంది.