కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
108 దివ్య తిరుపతులలో ఒకటిగా కుంభకోణం ( తిరు కుడందై) కనిపిస్తూ ఉంటుంది. అనేక ఆలయాల సమాహారంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. తమిళనాడులోని ఈ క్షేత్రంలో స్వామివారు శారంగపాణి పేరుతోను .. అమ్మవారు కోమలవల్లి తాయారు పేరుతోను పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఇక్కడి గర్భగుడి రథం ఆకారాన్ని పోలివుండటం విశేషం. ఆలయానికి ఉత్తర వాకిలి .. దక్షిణ వాకిలి వున్నాయి. ఉత్తరాయణంలో ఉత్తర వాకిలిని తెరవడం మరో విశేషం. పూర్వం సూర్యభగవానుడు సుదర్శన చక్రంతో పోటీపడి తన తేజస్సును కోల్పోయాడు. అప్పుడు ఆయన ఈ క్షేత్రంలో...