జనాభా లెక్కలతోనే సరైన అభివృద్ధి: కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, (ప్రభంజనం) : ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు అభివృద్ధికి జనాభా లెక్కలే అత్యంత కీలకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రానున్న జనగణన-2027 సన్నాహకాల్లో భాగంగా జిల్లా జనాభా లెక్కల హ్యాండ్ బుక్ తయారీపై గురువారం ఆమె కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి రంగం యొక్క సమగ్ర సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా ఖచ్చితంగా...