Raksha Bandhan: ఖాకీ చేతికి ప్రేమబంధం.. సీఐకి రాఖీ కట్టిన చిన్నారులు

కేపీహెచ్‌బీ ( ప్రభంజనం): రక్షాబంధన్‌ సందర్భంగా కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఆప్యాయత నిండిన దృశ్యాలు కనిపించాయి. ఓ పాఠశాలకు చెందిన చిన్నారులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సీఐ విజయ్‌కుమార్‌కు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్‌ సిబ్బందికి సైతం రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పండుగ రోజున కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చిన్నారుల రాక ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపింది. అనంతరం పోలీసులు చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారితో ఆత్మీయంగా గడిపారు.