మేడ్చల్ నియోజకవర్గంలో రియల్ మోసం.. కాళేశ్వరం కాలువలో మునిగిన ‘ఎస్సార్ వెంచర్’..!
అనుమతులు లేవు.. అక్రమ విక్రయాలే లక్ష్యం 70 మంది అమాయక బాధితుల ఆవేదన ప్రభుత్వ పరిహారాన్నీ నొక్కేసిన రియల్ వ్యాపారి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు మేడ్చల్: రూపాయి రూపాయి కూడబెట్టి.. సొంతింటి కలను నిజం చేసుకుందామనుకున్న మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెలగాటమాడాడు. ఎలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్‌ను అంటగట్టి, సుమారు 70 మంది కుటుంబాలను రోడ్డున పడేశాడు. చివరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారాన్ని సైతం ఆ వ్యాపారే కాజేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అసలేం జరిగిందంటే..?...