జగిత్యాల జిల్లాలో 102 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల (ప్రభంజనం): పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన 102 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు...