రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ కీలక భేటీ.. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఇటీవల రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత చిన్నారెడ్డి...