కొండాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

బైక్ ను ఢీకొన్న కారు,కేసు నమోదు. శేరిలింగంపల్లి,(ప్రభంజనం): కొండాపూర్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి వచ్చిన వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో థార్ వాహనం (ఏపీ 40 హెచ్ యూ 0555), ద్విచక్ర వాహనం ( టీజీ...