ప్రమాదంలో అంగవైకల్యం పొందిన ఆర్టీసీ డ్రైవర్‌కు రూ.50 లక్షల బీమా

యూనియన్‌ బ్యాంక్‌ సహకారంతో కుటుంబానికి ఆర్థిక భరోసా హైదరాబాద్‌: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై కాలు కోల్పోయిన టీజీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ ఎం.డి. మదార్‌ కుటుంబానికి రూ.50 లక్షల బీమా సాయం అందింది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘సూపర్‌ సాలరీ సేవింగ్స్‌ అకౌంట్‌’ ఉచిత ప్రమాద బీమా పథకంలో భాగంగా ఈ మొత్తాన్ని అందించారు. సోమవారం హైదరాబాద్‌ బస్‌భవన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ వీసీ, ఎండీ వై. నాగిరెడ్డి, యూబీఐ సీజీఎం ఎం. రవీంద్రబాబు బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. కోరుట్ల డిపో డ్రైవర్‌ మదార్‌...