రైతుబంధు మంచిదే.. కానీ కోటీశ్వరులకూ లబ్ధి: TG హైకోర్టు
పథకాల పుణ్యాన పనులు చేయడం మానేశారు. పల్లెటూర్లలో వ్యవసాయ కూలీలు దొరకట్లేదు ఐఏఎస్ సందీప్ సుల్తానియా కేసు విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ : ఉచిత పథకాల ద్వారా ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు ఏం చెబుతున్నాయని తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. రైతుబంధు పథకం మంచిదే అయినప్పటికీ, ఎంతో మంది కోటీశ్వరులు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వ పథకాల కారణంగా ప్రజలు పనులు చేయడం మానేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెటూర్లలో కూలీలు కూడా దొరకని పరిస్థితి...