మత్స్యకారులకు సర్కార్ బీమా భరోసా.. 4.21 లక్షల మందికి రక్షణ
హైదరాబాద్: రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS)ను వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.వృత్తిరీత్యా రిస్క్‌తో కూడుకున్న పనిలో ఉండే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా వికలాంగులైతే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పించడమే ఈ...