టేక్మాల్‌లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

నివాళులర్పించిన గౌడ సంఘం నాయకులు టేక్మాల్: ( ప్రభంజనం ) టేక్మాల్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను మంగళవారం మండల గౌడ సంఘం బాధ్యుడు సందీప్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టేక్మాల్ చౌరస్తాలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి...