ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

హైదరాబాద్ :టీపీసీసీ ప్రతినిధి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ నాయకుడు బుడ్డ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.బుడ్డ సత్యనారాయణను కులం పేరుతో దూషిస్తూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.ఈ వ్యవహారంపై గత మూడు రోజులుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో దళిత, ఎస్టీ సంఘాలు...