PRABANJANAM
Date of Publish : 23 September 2026, 12:03 pm Posted by : Prabanjanam News

క్యాబ్ వద్ద మహిళా ఉద్యోగినికి ముద్దు.. సెక్యూరిటీ గార్డు అఘాయిత్యం

శేరిలింగంపల్లి ( ప్రభంజనం ): క్యాబ్ ఎక్కుతున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి ముద్దుపెట్టిన ఘటన గచ్చిబౌలి ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ( 24) తన విధులు ముగించుకుని క్యాబ్ ఎక్కేందుకు వెళ్తుండగా, జార్ఖండ్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్ ఆమెను పక్కకు లాగి ముద్దుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలు గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.