బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం..భారత్ సాయం కోరిన బంగ్లా ప్రభుత్వం
ఇంటర్నేషనల్ డెస్క్ ( ప్రభంజనం ) :బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజుకు 9 నుంచి 10 గంటల వరకు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ సుమారు 18,000 మెగావాట్లుగా ఉండగా, ఉత్పత్తి 13,000 మెగావాట్లకు కూడా చేరడం లేదని సమాచారం. మరోవైపు దేశంలో తీవ్ర ఎండలు,...