PRABANJANAM
Date of Publish : 22 August 2026, 7:55 pm Posted by : Prabanjanam News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు

చందానగర్‌ (ప్రభంజనం): చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్‌ ఎస్‌ఐ బాలరాజుతో పాటు కానిస్టేబుళ్లు రాఘవ, రాజ్‌కుమార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్‌ఐ బాలరాజును ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఎంత మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారనే విషయాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ చందానగర్‌ ఎస్సై బాలరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌, స్టేషన్‌ రైటర్‌ రాఘవను సైతం అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఓ భూవివాదానికి సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కోసం రూ.75 వేలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎస్సై బాలరాజును పోలీస్‌స్టేషన్‌లోనే ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఏసీబీ అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.