లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు

చందానగర్‌ (ప్రభంజనం): చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అడ్మిన్‌ ఎస్‌ఐ బాలరాజుతో పాటు కానిస్టేబుళ్లు రాఘవ, రాజ్‌కుమార్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్‌ఐ బాలరాజును ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఎంత మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారనే విషయాలు అధికారికంగా వెల్లడికావాల్సి...