PRABANJANAM
Date of Publish : 16 September 2026, 8:32 am Posted by : Prabanjanam News

నాచారంలో ఘనంగా సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు..

  • పెద్ద ఎత్తున పాల్గొంటున్న కాలనీవాసులు, భక్తులు

నాచారం: ( ప్రభంజనం)

నాచారం అన్నపూర్ణ కాలనీలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అంజి–మంజుల దంపతులు తమ కుమారులు అఖిల్, ప్రణీత్‌లతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్, రామచందర్ నాయక్, నాయుడు, బాలయ్య, శ్రీశైలం, శ్రీనివాస్, శ్రీధర్, లక్ష్మీకాంత్, సాయికుమార్, బలరాం, అజయ్, రాజిరెడ్డి, ప్రసాద్, తరుణ్, ముఖేష్, బాలత్రిపుర, శ్రావణ్ కుమార్, జగదీశ్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.