లఖిసరాయ్‌లో అశోక్‌ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట..

ఏడుగురు మృతి, పలువురికి గాయాలు బీహార్ : ( ప్రభంజనం ) బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రావణ మాసం సందర్భంగా అశోక్‌ధామ్ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో పరిస్థితి అదుపుతప్పినట్లు తెలుస్తోంది. భక్తుల ఒత్తిడికి బారికేడ్లు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు...