మేడ్చల్ జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి

యమ్నంపేటలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం ఘట్కేసర్: ( ప్రభంజనం ) మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యమ్నంపేట గ్రామంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. స్థానిక శ్రీనిధి ఇంజనీరింగ్ యూనివర్సిటీ సమీపంలోని పొదల్లో సుమారు 20 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, సుమారు పది రోజుల క్రితమే యువతి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం...