ఎస్వీకే గచ్చిబౌలి అడ్మిన్ సి. విజయ్ కుమార్ మృతి
సీపీఎం నాయకుల నివాళులు శేరిలింగంపల్లి, ( ప్రభంజనం ) సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) గచ్చిబౌలి అడ్మిన్ సి. విజయ్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు, ఎస్వీకే ప్రతినిధులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ అంత్యక్రియల్లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కామ్రేడ్ బి.వి. రాఘవులు, ఎస్వీకే సెక్రటరీ పి. ప్రభాకర్, ఎస్వీకే బాగ్‌లింగంపల్లి సెక్రటరీ వినయ్ కుమార్, ట్రస్టు సభ్యులు ఆర్. సాంబశివరావు, అడ్మిన్ రమణరావు, బుచ్చిరెడ్డి, సోమన్న,...