యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర వేడుకలు.. గిరి ప్రదక్షిణ
భారీగా తరలివచ్చిన భక్తజనం.. యాదగిరిగుట్ట: (ప్రభంజనం) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ఆలయ ఈఓ భవాని శంకర్ తో కలిసి ఎమ్మెల్యే...