PRABANJANAM
Date of Publish : 04 September 2026, 11:43 am Posted by : Prabanjanam News

బాలానగర్ లో ఉద్రిక్తత… కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్

కూకట్ పల్లి: కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, బూటకపు 6 గ్యారంటీలు పై కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమానికి బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరవుతున్న నేపథ్యంలో కూకట్ పల్లి ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో బాలానగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎమ్మెల్యే కృష్ణారావు గత ప్రభుత్వం లో  10ఏళ్ల చేసిన అభివృద్ధి శూన్యం అని నిలదీస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయడం తగదని అన్నారు.