ఏసీబీకి చిక్కిన ఉత్తమ అధికారి.. మైనింగ్ ఏడీ జయరాజ్ ఇంట్లో సోదాలు..
భూపాలపల్లి మైనింగ్ ఏడీ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు వరంగల్ బ్యూరో (ప్రభంజనం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) బొజ్జ జయరాజ్ నివాసాలు, కార్యాలయాలతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు...