ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ మృతి.. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
కామారెడ్డి( ప్రభంజనం ): గర్భసంచి ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ అనస్థీషియా ఇచ్చిన అనంతరం మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలానికి చెందిన రాజేశ్వరి (42) గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్ చికిత్స కోసం కామారెడ్డిలోని జీవదాన్ హాస్పిటల్‌లో చేరింది. ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర...