కార్ల కాన్వాయ్లో గణనాథుడి గ్రాండ్ ఎంట్రీ..
జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన చిన్నవాల్గోట్ సిరికొండ : (ప్రభంజనం) నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామంలో గణనాథుడి ఆగమనం ఈసారి వినూత్నంగా నిర్వహించారు. శ్రీ రామసేనా విఘ్నహర్త మండలి రామసేన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేసి, వాటితో భారీ కాన్వాయ్గా వినాయకుడిని గ్రామంలోకి తీసుకువచ్చారు. జై శ్రీరామ్, జై రామ్ నినాదాలతో కార్ల కాన్వాయ్ ప్రధాన వీధుల గుండా ముందుకు సాగడంతో పండుగ వాతావరణం నెలకొంది. వినాయకుడి ఊరేగింపు సందర్భంగా డప్పుల సప్పుళ్లతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు...