మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..
మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్, సెప్టెంబర్ 22 (ప్రభంజనం): మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్‌లో ఐదు రోజులుగా కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. జీవో 52ను రద్దు చేసి ప్రస్తుత రూ.19,500 వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని కోరారు. విధి నిర్వహణకు...