- కీసర మండలంలో రేషన్ డీలర్లకు ఘన సన్మానం
కీసర: ( ప్రభంజనం )
తెలంగాణ ఆహార భద్రత పథకాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కీసర మండల సామాజిక సేవా కార్యకర్తలు సామాజిక సేవా కార్యకర్తలు తుడుం శ్రీనివాస్, రాగుల రమేష్ లు పేర్కొన్నారు. పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా లబ్ధిదారులకు నిరంతరం బియ్యం, ఇతర ఆహార ధాన్యాలను అందిస్తున్న రేషన్ డీలర్ల సేవలను గుర్తిస్తూ శుక్రవారం కీసర మండలంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కీసర మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు తటాకం వెంకటేష్ శర్మతో పాటు కుంటోళ్ల విజయచందర్, గండు లాలి యాదవ్‌లను సామాజిక సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అధ్యక్షులు తటాకం వెంకటేష్ శర్మ మాట్లాడుతూ, తమ సేవలను అధికారులు, నాయకులు, ఇతరులు ఇంతవరకు గుర్తించలేదని, అయితే కీసర మండల సామాజిక సేవా కార్యకర్తలు రేషన్ డీలర్ల సేవలను గుర్తించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రేషన్ లబ్ధిదారులకు ఎల్లప్పుడూ సమయానికి బియ్యం సరఫరా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారుల ఆశీస్సులతో మరింత ఉత్సాహంగా సేవలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కీసర మండల సామాజిక సేవా కార్యకర్తలు తుడుం శ్రీనివాస్, రాగుల రమేష్ ముదిరాజ్, బుడిగ జగన్, చిలక ముత్యాలు ముదిరాజ్, పండుగ రాజలింగం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.