హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటీ

హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటీ సరూర్‌నగర్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు ఎల్బీనగర్: ( ప్రభంజనం ) రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవడంతో యువత రోడ్డున పడుతోంది. చివరికి చిన్న చిన్న ప్రైవేట్, తాత్కాలిక ఉద్యోగాల కోసం కూడా వేల సంఖ్యలో యువత పోటీపడుతున్న దయనీయ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తాజాగా దీనికి నిదర్శనంగా నిలిచిన ఘటనే హైడ్రా డ్రైవర్, డీఆర్‌ఎఫ్ ఉద్యోగాల ప్రకటన. హైడ్రా పరిధిలో మొత్తం 150...