ఫీజులు కట్టలేదని కాలేజీ నుండి గెంటేస్తున్నారు..!
ఫీజులు కట్టలేదని గేటు బయటకు.. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్తత! విద్యార్థుల ఆందోళన.. యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ నాయకులు ధర్నా ఫీజుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తెస్తే ఆందోళన ఉదృతం చేస్తాం కళాశాల యాజమాన్యానికి ఏబీవీపీ హెచ్చరిక మేడ్చల్ ప్రతినిధి: (ప్రభంజనం ) మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఫీజుల అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను యూనివర్సిటీ గేటు బయటకు పంపిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎదుట మంగళవారం...