పటాన్ చెరువులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే గూడెం.. అందరి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా పటాన్ చెరు నియోజకవర్గం. పటాన్ చెరువు , ఆగస్ట్ 15 (ప్రభంజనం): ప్రజల సహకారం,సమష్టి కృషితో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం, ఎంపీడీవో, ఎమ్మార్వో, వివిధ సంక్షేమ సంఘాల కార్యాలయాలతో పాటు, మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో...