నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం..

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఆర్‌ఐ మృతి నిజామాబాద్ ప్రతినిధి: ( ప్రభంజనం ) నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) సతీష్ తన సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. సతీష్ ఎన్‌ఎస్‌ఓ డ్యూటీ పూర్తి చేసుకుని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వచ్చారు. అనంతరం తన సర్వీస్ వెపన్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో అది అనుకోకుండా పేలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు....