పండగపూట పోచారంలో విషాదం..
వినాయక విగ్రహం కొనుగోలు వివాదంలో వ్యక్తి మృతి మృతుడి బంధువుల ఆందోళన.. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా! ఘట్కేసర్: (ప్రభంజనం) వినాయక చవితి వేళ పోచారంలో విషాదఘటన చోటుచేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం కిరణ్ (24) వ్యక్తి ప్రాణాలను తీసింది. విగ్రహాల విక్రేతలకు, కొనుగోలుదారులకు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చౌదరిగూడకు చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ...