PRABANJANAM
Date of Publish : 06 August 2026, 12:19 pm Posted by : Prabanjanam News

తిరుమలగిరిలో విషాదం.. బైక్ అదుపుతప్పి విద్యార్థి మృతి

  • మరో యువకుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు

  • లాల్‌బజార్‌-డైరీఫారం మార్గంలో ఘటన

సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కాలేజీ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌బజార్‌ నుంచి డైరీఫారం వైపు వెళ్తున్న మార్గంలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు అపాచీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మరో టూ వీలర్‌ను ఓవర్టేక్ చేసేందుకు వారు ప్రయత్నించారు.అయితే, అతివేగం కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఒక విద్యార్థి సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.