తిరుమలగిరిలో విషాదం.. బైక్ అదుపుతప్పి విద్యార్థి మృతి

మరో యువకుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు లాల్‌బజార్‌-డైరీఫారం మార్గంలో ఘటన సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కాలేజీ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌బజార్‌ నుంచి డైరీఫారం వైపు వెళ్తున్న మార్గంలో ఇద్దరు కాలేజీ విద్యార్థులు అపాచీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మరో టూ వీలర్‌ను ఓవర్టేక్ చేసేందుకు వారు ప్రయత్నించారు.అయితే, అతివేగం కారణంగా వాహనం అదుపుతప్పి రోడ్డు...