యాదగిరిగుట్టలో విషాదం..
పుష్కరిణిలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి దర్శనానికి వచ్చిన కుటుంబంలో తీరని శోకం యాదగిరిగుట్ట (ప్రభంజనం): శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పుష్కరిణిలో పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధిలోని బడంగ్‌పేటకు చెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కల్యాణకట్ట సమీపంలోని పుష్కరిణిలో కుటుంబ సభ్యులు స్నానం చేస్తుండగా, వారి నాలుగేళ్ల కుమార్తె శివలింగం ఆద్య పుష్కరిణి మెట్ల వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి...