PRABANJANAM
Date of Publish : 14 August 2026, 9:00 am Posted by : Prabanjanam News

సీపీఎస్ విధానంపై రాజీలేని పోరాటం

  • చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

మునుగోడు: (ప్రభంజనం)

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ ( టీఎస్సీపీఎస్ఈయూ ) ఆధ్వర్యంలో ఆగస్టు 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ ఎస్ నాంపల్లి, టీజీఎంఎస్ జూనియర్ కళాశాలలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పీఆర్టీయూ రాష్ట్ర అకడమిక్ గైడెన్స్ కమిటీ రాష్ట్ర నాయకులు నక్క యుగంధర్, మండల ప్రధాన కార్యదర్శి కిరణ్, టీఎస్టీయూఎఫ్ మండల కార్యదర్శి వెంకన్న సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎస్ జిల్లా నాయకులు గురిజ మహేష్, రచ్చ శ్రీను, నాగిళ్ల ఆంజనేయులు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.