PRABANJANAM
Date of Publish : 14 September 2026, 7:37 pm Posted by : Prabanjanam News

ఘట్కేసర్‌లో ఘనంగా “అప్ డేటింగ్ ప్యార్” సినిమా విడుదల

  • చిత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్

ఘట్కేసర్: (ప్రభంజనం)

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్‌లోని పాత గ్రామ పంచాయతీ ఆవరణంలో రూపొందించిన “అప్ డేటింగ్ ప్యార్” లఘు చిత్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేశారు. ‘కళల భానుడు’ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర దర్శకుడు షేను భాను చందర్ మాట్లాడుతూ.. నేటితరం యువతలో మారుతున్న ప్రేమ సంబంధాలు, కో-లివింగ్ విధానం, పెళ్లికి ముందే గర్భం దాల్చినప్పుడు ఎదురయ్యే సవాళ్లు, కుటుంబ ఒత్తిడి, సామాజిక మానసిక సంఘర్షణలను ఇతివృత్తంగా చేసుకుని, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి అభినందిస్తూ, నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సున్నితమైన సమస్యలను ప్రతిబింబించేలా ఈ సినిమాను రూపొందించారని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ‘కళల భానుడు’ యూట్యూబ్ ఛానల్‌లో ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరో మహేష్, హీరోయిన్ సుష్మిత గిరిధారి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మేకల నర్సింగ్ రావు, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొక్కా ప్రభాకర్ రెడ్డి, పోచారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సామల సందీప్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.