ఘట్కేసర్‌లో ఘనంగా “అప్ డేటింగ్ ప్యార్” సినిమా విడుదల
చిత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఘట్కేసర్: (ప్రభంజనం) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘట్కేసర్‌లోని పాత గ్రామ పంచాయతీ ఆవరణంలో రూపొందించిన “అప్ డేటింగ్ ప్యార్” లఘు చిత్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ యూట్యూబ్‌లో అధికారికంగా విడుదల చేశారు. 'కళల భానుడు' యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర దర్శకుడు షేను భాను చందర్ మాట్లాడుతూ.. నేటితరం యువతలో మారుతున్న ప్రేమ సంబంధాలు, కో-లివింగ్ విధానం,...