- స్వచ్ఛభారత్ కార్యక్రమం, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
ఉప్పల్:(ప్రభంజనం )
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉప్పల్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఉప్పల్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మారినేని ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
అనంతరం ఎంఎంసీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి, వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు షామీర్‌పేట్ ధర్మారెడ్డి, ఉప్పల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తీగ విఠల్ రావు ముదిరాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, దువ్వల రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఫకీర్ నర్సిరెడ్డి, ఏ. సూరి యాదగిరి, బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు ఆడెపు రమేష్, గిరిజన మోర్చా అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్, మమత, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బుర్ర జ్యోతి, శారద, ఎంఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.