వర్షాల కోసం వరుణ యాగం… ఈనెల 10నముహూర్తం ఫిక్స్
ప్రభంజనం: రాష్ట్రంలో తక్కువ వర్షాపాతం నమోదైన నేపథ్యంలో వరుణ యాగం చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సంమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకుయాదగిరిగట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటిడి) అర్చక, సిద్ధాంతులు ఆగస్టు 10 వ తేదీన వరుణ...