గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

శేరిలింగంపల్లి నాయకుడికి టీఆర్ఎస్ చీఫ్ అరుదైన అవకాశం సిటీ బ్యూరో: ( ప్రభంజనం ) తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ వర్గ ఇంఛార్జీగా ఉన్న వాసిలి చంద్రశేఖర ప్రసాద్ కు మరో అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌ను నియమిస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం...